కర్బాబాద్‌ బీచ్‌ని శుభ్రం చేసిన విద్యార్థులు

- December 29, 2017 , by Maagulf
కర్బాబాద్‌ బీచ్‌ని శుభ్రం చేసిన విద్యార్థులు

మనామా: అరవమై స్కూళ్ళకు చెందిన విద్యార్థులు కర్బాబాద్‌ బీచ్‌ని శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ సహకారంతో క్యాపిటల్‌ సెక్రెటేరియట్‌ కౌన్సిల్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. క్యాపిటల్‌ మునిసిపల్‌ కౌన్సిల్‌ బోర్డ్‌ ఆఫ్‌ చైర్మన్‌ ఇంజనీర్‌ మొహమ్మద్‌ అల్‌ అల్‌ ఖుజై విద్యార్థులకు బీచ్‌ క్లీనింగ్‌పై సందేశాన్నిచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ప్రపంచమంతా ఒక్కతాటిపైకి రావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. నేషనల్‌ డే ఈవెంట్‌ అలాగే వాకథాన్‌లను సమర్థవంతంగా నిర్వహించిన క్యాపిటల్‌ మునిసిపల్‌ కౌన్సిల్‌, ఆ తర్వాతి క్రమంలో ఈ వెంట్‌ని నిర్వహించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణలో ప్రజల్నీ భాగం చేయాలనీ, విద్యార్థులకు పర్యావరణం పట్ల అవగాహన పెంచేలా చూడాలనీ, ఈ ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అల్‌ ఖుజై చెప్పారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు బీచ్‌ శుభ్రత కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని క్యాపిటల్‌ మునిసిపల్‌ కౌన్సిల్‌ - పబ్లిక్‌ రిలేషన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ కౌన్సిల్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ కౌన్సిల్‌ కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ మహా అల్‌ సిహాబ్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com