ఒమన్ లో తీవ్రమైన గాయాలతో హత్యకు గురైన వ్యక్తి..ఘాలలో మృతదేహం లభ్యం
- December 29, 2017
మస్కట్ : ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి హత్య చేసి మృతదేహాన్ని దూరంగా పారవేసి ఓ అయిదుగురు నిందితులు చేతులను దులుపుకొన్నారు. అయితే చేసిన పాపం వెంటాడక తప్పదని మరోమారు రుజువు కాబడింది. ఘాలలో మృతదేహం కనుగొన్న తర్వాత రాయల్ ఒమన్ పోలీసులు ఆ హంతకులను అరెస్టు చేశారు. మస్కట్ ప్రావిన్స్ పోలీసు కమాండర్ బుచర్ రాష్ట్రంలోని ఘలా పారిశ్రామిక ప్రాంతంలో హత్యకు పాల్పడినందుకు ఐదుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు ప్రకటించారు. రాయల్ ఒమన్ పోలీసులతో ఒక అధికారి మాట్లాడుతూ అల్-''అతిబా పోలీసు స్టేషన్ నివేదికను స్వీకరించిన తరువాత ఘలా ఇండస్ట్రియల్ జోన్లో ఎడారిలో ఒక ప్రాకారంతో ఉన్న ప్రదేశంలో రక్తపు గాయాలతో నేలమీద పడి ఉన్న స్థితిలో దారుణ హత్యకు గురైన ఒక గుర్తు తెలియని శవం కనిపించిందని తమకు ఒక సమాచారం అందిందని దానితో సంఘటనాస్థలానికి వెళ్లి ఆధారాలు సేకరించి హత్య చేసిన అయిదుగురు నిందితులను కీలకాధారాలతో సహా పట్టుకోవడం జరిగిందన్నారు. ఆ ఆరుగురి మధ్య నెలకొన్న ఒక వివాదం తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిందని ఆయన తెలిపారు. హతుడిని మిగిలినవారంతా తీవ్రంగా కొట్టారు. గాయపడిన ఆ ప్రతివాది అదేరాత్రి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. తేరుకున్న నిందితులు మృతశరీరాన్ని తీసుకొని ఎడారి ప్రాంతంలోనికి దారి తీసే గోడలు ఉన్న వీధిలోకి విసిరి పరారయ్యారు.ఈ ఐదుగురు అనుమానితులను విచారణ నిమిత్తం న్యాయ అధికారులకు వద్దకు సూచించారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు