ఒమన్‌లో షారుక్‌: మర్చిపోలేని అనుభూతి

- December 30, 2017 , by Maagulf
ఒమన్‌లో షారుక్‌: మర్చిపోలేని అనుభూతి

మస్కట్‌: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ఖాన్‌, కళ్యాణ్‌ జ్యుయెలర్స్‌కి చెందిన పలు శాఖల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దయెత్తున అభిమానులు ఆయన్ని చూసేందుకు వచ్చారు. ఇండియన్‌ ఫిలిం యాక్టర్స్‌ నాగార్జున, ప్రభు గణేశన్‌, మంజు వారియర్‌ తదితరులు ఈ ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. వీరిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. కళ్యాణ్‌ జ్యుయెలర్స్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ టి.ఎస్‌ కళ్యాణరామ్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్స్‌ రాజేష్‌ కళ్యాణరామ్‌, రమేష్‌ కళ్యాణ్‌రామ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షారుక్‌ మాట్లాడుతూ, ఒమన్‌లో కళ్యాణ్‌ జ్యుయెలర్స్‌ షోరూమ్స్‌ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందనీ, విదేశాల్లో అభిమానుల్ని ఎప్పుడు కలుసుకున్నా కొత్త ఉత్సాహం వస్తుందని అన్నారు. సుల్తానేట్‌లో ఇంత గొప్ప ప్రారంభోత్సవాలు జరపడం గర్వంగా ఉందని కళ్యాణ్‌ జ్యుయెలర్స్‌ అధినేత తెలిపారు. ప్రారంభోత్సవ ఆఫర్స్‌లో భాగంగా ఫ్రీ గిఫ్ట్స్‌ని కొనుగోళ్ళపై అందిస్తున్నారు. తమ బ్రాండ్‌ అంబాసిడర్స్‌ చాలా పాపులారిటీ ఉన్నవారనీ, వారి ద్వారా వినియోగదారులకు భరోసా ఇస్తోన్న తాము ఈ రంగంలో చిత్తశుద్ధితో తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నామని కళ్యాణరామన్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com