సౌదీ న్యాయమూర్తిని హత్య చేయమని ఫత్వా జారీ చేసిన మతగురువు
- December 30, 2017
రియాద్: ఏ మతం మరో మనిషిని ఖతం చేయమనదు. అటువంటిది ఒక మతగురువు ఏకంగా న్యాయమూర్తిని చంపేయమని ఫత్వా జారీ చేయడంతో పలువురు విస్తుపోయారు. గత ఏడాది 2016 డిసెంబర్‌లో హత్యకు గురైన న్యాయమూర్తి జిరానీ అవశేషాలు రెండు వారాల క్రితం బయటప డడంతో సంచలనం కల్గింది.. ఇరాన్‌కు చెందిన ఓ మతగురువు ఆదేశం మేరకు సౌదీకి చెందిన జడ్జీని ఉగ్రవాదులు దారుణంగా అంతమొందించారు. దారుణమైన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2016 సంవత్సరంలో అరెస్టైన మహమ్మద్ అల్ జిరానీ అనే సౌదీ న్యాయూమూర్తిని సౌదీఅరేబియాలోని ఖ్వతిఫ్ ఫ్రావిన్స్ ప్రాంతంలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అవామియా ప్రాంతంలోని ఓ గృహంలో రెండు రోజులపాటు నిర్భంధించారు. రహస్యంగా జడ్జీని నిర్భంధించేందుకు అవస్థలు పడిన ఉగ్రవాదులు విషయాన్ని ఇరాన్‌కు చెందిన మతగురువుకు తెలియజేశారు. దీంతో న్యాయమూర్తిని చంపేయాలంటే టెర్రరిస్ట్ సెల్ సభ్యులకు మతగురువు ఫత్వా జారీ చేశారు. అనంతరం ఉగ్రవాదులు న్యాయమూర్తిని హత్య చేశారని అశ్రఖ్ అల్ అస్వత్ అనే పత్రిక పేర్కొంది.
తాజా వార్తలు
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు







