బహ్రెయిన్‌లో మృతిచెందిన తెలంగాణ వాసి కుటుంబానికి టీఆర్ఎస్ సెల్ బహరేన్ ఆర్ధికసహాయం

- December 30, 2017 , by Maagulf

బహ్రెయిన్‌ లో ఇటీవల గుండెపోటుతో మరణించిన నిజామాబాద్‌ జిల్లా, భీమ్‌గల్‌ మండలు, మెండోరా గ్రామానికి చెందిన అల్లెపు గంగారాం 38, ఒక ప్రైవేట్ కంపెనీలో 26 నవంబర్ నాడు గుండె పోటుతో మృతిచెందగా అతని పార్తివ దేహాన్ని 11 రోజులో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో 6 డిసెంబర్ న స్వగ్రామానికి పంపించారు. మృతుడికి తల్లి తండ్రి భార్య నలుగురు కూతుళ్లు ఉన్నారు. అతని మరణంతో పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబ పరిస్థితులను చూసి ముందుకు వచ్చిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి వారి తోటి ఉద్యోగులు నర్సింహా చారి, రాజన్న, చిరంజీవి, మలేష్, అజయ్, దేవిషింగ్, భజన్న, ప్రమోద్, గంగారాం తదితరులు INR 86, 500/- రూ౹౹ ఇండియాకు పంపించాగ మరియు ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ గారు అతని ఇంటికి వెళ్లి ఆ కుటుంబాని పరామర్శించి ఓదార్చి అతని బంధువు గంగరాజం అద్వర్యంలో INR 86, 500/- రూ౹౹ ఆర్ధిక సహయాన్ని అతని కుటుంబానికి అందచేయడం జరిగింది. ఇందులో భాగంగా సహయాన్నికి ఖుషి చేసిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి, డా రవి, సెక్రెటరీలు రవిపటేల్, సుమన్, రాజేంధార్, జాయంట్ సెక్రెటరీలు గంగాధర్, విజయ్, సంజీవ్, దేవన్న, ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ సుధాకర్, రాజేష్, నర్సయ్య, సాయన్న, సిహెచ్ రాజేందర్, సర్న్ రాజ్, రాజేశ్వర్ జమ్ముల, వినోద్, వసంత్, శంకర్, రాజు, వెంకటేష్, రాంబాబు, బుచ్చిరెడ్డి, శేఖర్, భూమన్న, గంగాధర్, శ్రీగద్దె అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com