హింసాత్మకంగా మారిన ఇరాన్ నిరసనలు

- December 30, 2017 , by Maagulf
హింసాత్మకంగా మారిన ఇరాన్ నిరసనలు

ఇరాన్‌లోని పలు నగరాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వరుసగా మూడో రోజూ కొనసాగాయి. కొన్ని నగరాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయని వీడియో దృశ్యాలు చూపుతున్నాయి. దిగజారుతున్న జీవన ప్రమాణాలకు నిరసనగా మూడు రోజుల కిందట ఇరాన్‌లో ప్రజల ఆందోళనలు మొదలయ్యాయి. దేశంలో సంస్కరణలు కోరుతూ 2009లో జరిగిన ఆందోళనల తర్వాత మళ్లీ ఇప్పుడు భారీ స్థాయిలో నిరసనలు చెలరేగాయి.

‘‘చట్టవ్యతిరేకంగా గుమికూడవద్దు’’ అంటూ ఇరాన్ హోంమంత్రి చేసిన హెచ్చరికలను ఆందోళనకారులు పట్టించుకోలేదు. దోరుద్ పట్టణంలో ఇద్దరు నిరసనకారులు కాల్పుల్లో చనిపోయినట్లు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో చూపుతోంది. ఇతర ప్రాంతాల్లో ఆందోళనకారులు పోలీసు వాహనాలను దగ్ధం చేస్తున్న దృశ్యాలు మరికొన్ని వీడియోల్లో కనిపించాయి. ప్రభుత్వ భవనాలపైనా నిరసనకారులు దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com