‘అ!’ సినిమా లో కాజల్
- December 30, 2017
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తొలిసారిగా నిర్మాతగా మారి రూపొందిస్తున్న సినిమా ‘అ!’. విభిన్న కథతో, ఆసక్తికరమై నటీనటులతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా నాని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అ!’... నటీనటులను ఒక్కొక్కరిగా పరిచయం చేస్తూ వస్తున్నాడు.
నిత్యామీనన్, అవసరాల శ్రీనివాస్, ఇషా రెబ్బా, రెజీనా, మురళీ శర్మ, ప్రియదర్శిలతో పాటు సినిమాలో కీలక పాత్ర పోషించే ఓ చేప, చెట్టు పాత్రలను కూడా ఇప్పటికే పరిచయం చేశారు. తాజాగా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న కాజల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు ‘అ!’ యూనిట్. గులాబి పువ్వుతో ఉన్న కాజల్ ముఖాన్ని పూర్తిగా రివీల్ చేయకుండా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. ‘అ!’లో ఆమె క్యారెక్టర్ గురించి హింట్ ఇస్తూ నిర్జీవ ఆత్మ అంటూ పరిచయం చేశారు. ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







