గల్ఫ్ లో మహేశ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
- December 31, 2017
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఉంటే సినిమా షూటింగ్ లో ఉంటాడు.. లేదంటే.. తన కుటుంబం తో గడుపుతాడు.. ఇక సెలవులు దొరికితే తన ఫ్యామిలీ తో కలిసి ఎక్కువుగా విదేశీ టూర్లకు వెళ్తాడు.. ప్రతి ఏడాది తన కుటుంబం తో కలిసి విదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలను జరుపుకొనే మహేశ్.. ఈ ఏడాది కూడా తన ఫ్యామిలీతో విదేశాలకు వెళ్ళాడు. తమ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవడానికి గల్ఫ్ వెళ్లారు.. మహేశ్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఒమన్ దేశంలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను మహేశ్ భార్య నమ్రత షేర్ చేసింది. ప్రస్తుతం మహేశ్ బాబు కొరటాల శివ దర్శకత్వం లో భరత్ అను నేను సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి.. తన కుటుంబ సభ్యులతో పాటు.. స్నేహితులతో వెకేషన్స్ ను గడుపుతున్నాడు.. కాగా లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రిషన్స్ మహేశ్ దంపతులు.. రామ్ చరణ్ దంపతులతో కలిసి చేసుకొన్న సంగతి విధితమే.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







