ఫ్రాన్స్ లో 22 భారతీయ మైనర్ల అదృశ్యం
- December 30, 2017
రగ్బీ శిక్షణ కోసం ఫ్రాన్స్‌కు వెళ్లిన 22 మంది భారతీయ మైనర్లు అదృశ్యమయ్యారు. ఘటనకు కారకులైన ట్రావెల్ ఏజెంట్ల పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారి నుంచి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. సీబీఐ ప్రతినిధి అభిషేక్ దయాల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రెంచ్ ఫెడరేషన్ ఆఫ్ పారిస్ ఆహ్వానం పై 25 మంది మైనర్లను నిబంధనలకు విరుద్ధంగా ట్రావెల్ ఏజెంట్లు పారిస్‌కు తీసుకెళ్లారు. ఇందుకుగాను మైనర్ల తల్లిదండ్రుల నుండి 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు తీసుకున్నారు. పారిస్‌కు వారిని తీసుకెళ్లిన తర్వాత ఒక వారం పాటు రగ్బీ ట్రైనింగ్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.
కానీ వారి తిరుగు ప్రయాణానికి ట్రావెల్ ఏజెంట్లు టికెట్లు రద్దు చేశారు. కాగా ఇద్దరు పిల్లలు మాత్రం ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే మిగతా వారిని స్థానిక గురుద్వారాలో ఉంచినట్టు సమాచారం. అందులో ఒకరిని ఫ్రెంచ్ పోలీసులు పట్టుకొని ఇంటర్‌పోల్‌కు సమాచారం అందించారు. ఈ విషయాన్ని ఇంటర్‌పోల్..సీబీఐకి తెలిపింది. దీంతో సీబీఐ విచారణ ప్రారంభించింది. ట్రావెల్ ఏజెంట్లలో ఫరీదాబాద్‌కు చెందిన లలిత్ డేవిడ్ డీన్, ఢిల్లీకి చెందిన సంజరు రారు, వరుణ్ చౌదరీల నుండి సీబీఐ పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







