డ్రంక్ అండ్ డ్రైవ్ లో బుక్కైన యాంకర్

- January 01, 2018 , by Maagulf
డ్రంక్ అండ్ డ్రైవ్ లో బుక్కైన యాంకర్

ఆయనో ప్రముఖ యాంకర్, అందరికి అన్ని చెబుతారు, నీతులు బోధిస్తారు, కానీ తాను మాత్రం పాటించడు. న్యూ ఇయర్ సందర్బంగా జాగ్రత్తగా ఉండండి, మందు ఎక్కువ తాగకండి, అని తెగ 'షో' చేసిన ప్రదీప్ నిన్న రాత్రి హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా బుక్కయ్యారు. కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్న అతను పూటుగా మద్యం సేవించి దర్జాగా కారు నడుపుతున్నాడు. దీంతో ప్రదీప్ కు పోలీసులు బ్రీత్ ఎనలైజ్ చెయ్యగా 178 పాయింట్లు నమోదయ్యాయి. సాధారణంగా 35 పాయింట్లు దాటితేనే వాహనం నడిపిన వ్యక్తికి శిక్షతో పాటు వాహనం సీజ్‌ వంటి చర్యలుంటాయి. అయితే అబ్బాయిగారికి మాత్రం మరీ ఎక్కువగా 178 పాయింట్లు రావడంతో శిక్ష తప్పదని అంటున్నారు.  

ఇదిలావుంటే యాంకర్ ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో బుక్కవడంతో సోషల్ మీడియా వేదికగా సెటైర్ లు వేస్తున్నారు యువత. 'మాకు  చెప్పి నువ్వు దొరికిపోయావు ఇక అనుభవించు' అని బుల్లితెరలో పంచ్ లు వేసే ప్రదీప్ కె రివర్స్ పంచ్ లు వేస్తున్నారు నెటిజన్లు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com