కూలిన విమానం, 12 మంది మృతి
- January 01, 2018
కోస్టారికా దేశం జానాకాస్ట్ ప్రావిన్స్‌లోని పర్వతాల్లో ఓ చిన్న విమానం కూలిపోవడంతో 12 మంది చనిపోయారు. వీరిలో 10 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని స్థానిక అధికారులు తెలిపారు. సెస్నా 208బీ అనే చిన్న విమానం పది మంది ప్రయాణికులతో ఆదివారం మధ్యాహ్నాం 12.10 గంటలకు నండయూర్లోని పుంటా ఇస్లిటా ఎయిర్ పోర్టు నుంచి రాజధాని నగరం శాన్ జోస్‌కు బయలుదేరింది.
10 నిమిషాల్లోనే ప్రమాదానికి గురైనట్లు సివిల్ ఏవియేషన్ అధికారులకు సమాచారం అందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు విచారణ అయ్యాకే వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు కోస్టారికా అధ్యక్షుడు సోలిస్ రివేరా సంతాపం తెలిపారు. మృతులకు సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







