ఉగ్రవాదంపై పోరాడుతున్నాం.. పాకిస్తాన్
- January 01, 2018
డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పాక్ అలర్టయ్యింది. ఉగ్రవాదులపై తాము పోరాటం చేస్తూనే ఉన్నామని పాకిస్థాన్ విదేశాంగశాఖ మంత్రి ఖవాజా అసిఫ్ చెప్పుకొచ్చారు. ట్రంప్ ట్వీట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే అసిఫ్ దీనిపై ట్వీట్ చేశారు. వీలైనంత త్వరలోనే ట్రంప్ వ్యాఖ్యలపై స్పందిస్తామని... నిజాలు, అవాస్తవాలకు మధ్య ఉన్న తేడా ఏమిటో ప్రపంచం త్వరలోనే తెలుసుకుంటుందని అసిఫ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఐతే.. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో పాక్‌కు భారీ షాక్ తగిలింది. గతంలో కూడా పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. మరోసారి అవే వ్యాఖ్యలను ఆయన పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో