కిమ్ జోంగ్ పై ట్రంప్ ఫైర్
- January 03, 2018
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ పిచ్చి పైత్యానికెక్కింది. ప్రపంచమంతా న్యూఇయర్ వేడుకల్లో మునిగి ఉంటే నా టేబుల్‌పై అణు బాంబు బటన్ ఉంది. నా వేలు దానిపైనే ఉంది. ఎప్పుడైనా దాన్ని ప్రెస్ చేసేస్తాను అంటూ అమెరికాను టార్గెట్ చేస్తున్నాడు. అయితే అగ్ర రాజ్య అధినేత ట్రంప్ కూడా కిమ్‌కి ధీటుగానే సమాధానం చెబుతున్నాడు. నాదగ్గర కూడా అంతకంటే శక్తి వంతమైన అణు బాంబు ఉంది అని అంటున్నాడు. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. అణు ప్రయోగాల విషయమై అనేక సార్లు బహిరంగంగానే హెచ్చరికలు చేసుకున్నారు.
ఇటీవల అమెరికా మిలిటరీ మాజీ చీఫ్ ఉత్తరకొరియాకు యుద్ధానికి సిద్దంగా ఉన్నామంటూ మెసేజ్ కూడా పంపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా ఉత్తర కొరియాపై రగిలిపోతోంది. యుద్ధ సంకేతాలు పంపుతోందని యూఎస్ జాయింట్ చీఫ్ మాజీ ఛైర్మన్ మైక్ ముల్లెన్ అన్నారు. ఇటీవల జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో కూడా ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించారు ట్రంప్. ఉత్తర కొరియాని మట్టుపెట్టడం తప్ప మరో మార్గం లేదని వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ హెచ్చరికలకు కిమ్ ఏమీ కామ్‌గా లేడు. గత ఏడాది నవంబర్‌లో ఆ దేశం అత్యంత శక్తివంతమైన క్షిపణిని అమెరికాపై ప్రయోగించింది. దీంతో ఆగేది లేదు. ముందు ముందు మా తడాఖా ఇంకా చూపిస్తామంటోంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!