మహేష్ బాబు సరసన పూజా హెగ్డే
- January 03, 2018
స్పైడర్ సినిమాతో విజయం అందుకున్న మహేశ్‌బాబు భరత్ అను నేను అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి సినిమాకు అంగీకరించాడు. అయితే ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మహేశ్ సరసన పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. పూజా హెగ్డే గతంలో దువ్వాడ జగన్నాథం (డిజే), ముకుంద సినిమాల్లో నటించింది. డీజేలోనైతే అందచందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీ వాసు దర్శకత్వంలో తీస్తున్న సినిమాలో నటిస్తోంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ సినిమాను హిట్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో అల్లరి నరేశ్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. భారీగా తెరకెక్కబోయే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
త్వరలో ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర బృందం.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల