ఇండియా:రైల్వే ప్రయాణికులకు శుభవార్త
- January 03, 2018
న్యూఢిల్లీ: నగదురహిత లావాదేవీలను మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగదురహిత లావాదేవీలను రైల్వే రంగంలో కూడా ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా రైల్వే శాఖ సొంతంగా డెబిట్ కార్డులను అందుబాటులోకి తేనుంది. అందుకోసం ఎస్బీఐతో రైల్వే శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ డెబిట్ కార్డులతో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటే.. నెలలో ఒకసారి లాటరీ తీసి పది మంది ప్రయాణికులకు 100శాతం క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్లు తెలిసింది. అంతేకాదు, ఇక్కడ మరో విశేషమేంటంటే ఈ డెబిట్ కార్డుల ద్వారా టికెట్ కొంటే ఎలాంటి సర్వీస్ చార్జీలు ఉండవు. ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!