నైజీరియా మసీదులో ఆత్మాహుతి దాడి 11 మంది మృతి
- January 03, 2018
అబూజ : బోర్నో రాష్ట్రంలో గాంబౌరు నగరంలోని మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది.ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...బుధవారం తెల్లవారుజామున గాంబౌరు నగరంలో ఆత్మాహుతి దాడి జరిగింది. మసీదులో ప్రార్థన చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో 14 మంది చనిపోయారు. మృతదేహాలన్నీ మసీదు ఆవరణలో చల్లాచదురైపడిపోయాయి.
భారీ పేలుడు కారణంగా పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. మసీదు భవనం తునాతునకలైంది. మసీదు శిధిలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉండివుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో ముమ్మర సహాయక చర్యలు చేపట్టామని అన్నారు. కాగా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. ఇదిలా ఉండగా, గతవారం మైదుగురీ నగరంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో నలుగురు పౌరులు మృతి చెందారు.
ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు బోకో హారమ్ మిలిటెంట్లు ప్రకటించుకున్నారు. గతేడాది నవంబర్లో నైజీరియా మసీదులో ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 50 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







