దావోస్‌లో దీపికా ప్రసాద్ - 'వాయిస్ ఆఫ్ యూత్'
- January 03, 2018
హైదరాబాద్:అత్యంత ప్రతిష్టాత్మకమైన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ద్వారా దావోస్‌లో జరిగే వార్షిక సమావేశాల్లో 'వాయిస్ ఆఫ్ ది యూత్' రిప్రెజెంటేషన్ కోసం హైదరాబాద్‌కి చెందిన సివిక్ ఎంటర్ప్రెన్యూర్ దీపికా ప్రసాద్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. అర్బన్ గవర్నెన్స్ ఇనీషియేటివ్ - లకీర్ కో-ఫౌండర్‌గా దీపికా ప్రసాద్ బాధ్యతల్ని నిర్వహిస్తుండడం చాలా గొప్ప విషయం. దావోస్‌లో జనవరి 23 నుంచి 26 వరకు జరిగే ఈవెంట్స్‌లో భారతదేశానికి చెందిన 150 మంది ప్రముఖులు, 3 వేల మందికి పైగా అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొంటారు. పలు దేశాల అధినేతలు, ప్రపంచ ప్రక్యాత సంస్థలకు చెందిన అధిపతులు, సివిల్ సొసైటీ లీడర్స్ ఈ ఈవెంట్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీ రామారావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తదితరులు ఈ ఈవెంట్స్‌లో పాలుపంచుకోనున్నారు. ముఖేష్ అంబానీ, చందా కొచ్చర్, ఎరిక్ సచ్మిద్త్, షెరల్ సాండ్బర్గ్, సత్య నాదెళ్ళ వంటి ప్రముఖులు అదనపు ఆకర్షణ కానున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఇనీషియేటివ్స్‌లో ఒకటైన గ్లోబల్ షేపర్స్ కమ్యూనిటీ మెంబర్‌గానూ దీపిక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇది యూత్ లెడ్ ఆర్గనైజేషన్. ఇందులో 150 దేశాలకు చెందిన 7 వేల మంది సభ్యులున్నారు. తమ తమ కమ్యూనిటీస్‌లో పాజిటివ్ ఛేంజ్ కోసం ఈ సంస్థ సభ్యులు పనిచేస్తారు. హైద్రాబాద్‌లోని గ్లోబల్ షేపర్స్ కమ్యూనిటీకి క్యూరేటర్‌గా ఉన్న ఆమె, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ - దావోస్‌లో యువతరం గళాన్ని వినిపించబోతున్నారు. 8 ఏళ్ళుగా ఆమె సౌత్ ఏసియా, ఈస్ట్ ఆఫ్రికాలో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆమెకు ఈ గౌరవం లభించింది. తెలంగాణ నుంచి యంగ్ ఎంటర్ప్రెన్యూర్, ఇంతటి ప్రతిష్టాత్మక సదస్సులో ప్రసంగించే అవకాశం దక్కడం గర్వకారణమని తెలంగాణ మంత్రి కెటియార్ చెప్పారు. నగరాల వైపుగా తరలుతున్న గ్రామీణ భారతం, పట్టణాల్లో పెరుగుతున్న ఉద్యోగావకాశాలు, అభివృద్ధి ఇతరత్రాల విషయాలపై దీపిక, వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ప్రసంగించబోతున్నారు. జనాభా పెరుగుదలతో వచ్చే సమస్యలు, వాటిని ఎదుర్కొనేందుకు ఉన్న మార్గాల గురించీ ఆమె ప్రస్తావిస్తారు తన ప్రసంగంలో. వరల్డ్ బ్యాంక్, ఐఎఫ్సి, రాకెఫెల్లర్ ఫౌండేషన్, బోష్, యూనిలీవర్, గిజ్, షెల్ ఫౌండేషన్, ప్రదాన్ వంటి ప్రముఖ సంస్థలకు ఆమె సలహాదారుగా, సపోర్టర్‌గా పనిచేశారు. స్టార్టప్ వేవ్ పేరుతో అతి పెద్ద వర్చ్యువల్ ఇన్క్యుబేషన్ ప్లాట్‌ఫామ్‌ని కూడా దీపిక రూపొందించారు.

తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







