తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు..

- January 03, 2018 , by Maagulf
తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు..

హైదరాబాద్‌ నలుమూలలకూ ఐటీ రంగాన్ని విస్తరించాలనే లక్ష్యాన్ని అందుకునే దిశగా తెలంగాణ సర్కారు మరో అడుగు ముందుకు వేసింది. నగరంలో మరో ఐటీ క్లస్టర్ ఏర్పాటు చేసే ప్రక్రియను మంత్రి కేటీఆర్ స్పీడప్ చేశారు. బుద్వేల్, రాజేంద్రనగర్ త్వరలో ఏర్పాటు చేయబోయే ఐటి క్లస్టర్ ప్రాంతాల్లో ఉదయం పర్యటించారు. క్లస్టర్ ఏర్పాటు కోసం సేకరించబోయే స్థలాలను అధికారులతో కలిసి పరిశీలించారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బుద్వేల్ ఐటి క్లస్టర్‌కు త్వరలో సీఎం శంకుస్థాపన చేస్తారని మంత్రి తెలిపారు. ఇక్కడ కంపెనీలు స్థాపించేందుకు 30కి పైగా కంపెనీలు ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయన్నారు. వీటిలో ఐటీ దిగ్గజాలతోపాటూ దేశీయ కంపెనీలు, ఇంటర్నేషనల్ లెవల్ మల్టీ నేషనల్ కంపెనీలు ఉన్నాయన్నారు. త్వరలో ఆయా కంపెనీలతో ప్రభుత్వం లాంఛనంగా ఒప్పందాలు చేసుకుంటుందని చెప్పారు.

కొత్త క్లస్టర్ ఏర్పాటు ద్వారా ఐటీ పరిశ్రమ నగరంలో మరింత విస్తరిస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ఈ క్లస్టర్లో అన్ని మౌలిక సౌకర్యాలూ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఐటీ క్లస్టర్‌కు సంభందించి బెస్ట్ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలన్నారు. ఈ క్లస్టర్ పూర్తి స్థాయిలో ఏర్పడ్డాక సుమారు లక్షా పాతిక వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయన్నారు. మరో ఐదేళ్లలోపే ఈ కంపెనీల కర్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com