ముంబైను వెంటాడుతున్న అగ్నిప్రమాదాలు..4 దుర్మరణం

- January 03, 2018 , by Maagulf
ముంబైను వెంటాడుతున్న అగ్నిప్రమాదాలు..4 దుర్మరణం
ముంబై:ముంబైను అగ్నిప్రమాదాలు వెంటాడుతున్నాయి. అర్థరాత్రి ఓ భవనంలో మంటలు ఎగసి పడడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. అంథేరీ ఈస్ట్‌లోని మమూన్‌ మంజిల్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి ఒకటిన్నర సమయంలో మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మృతుల్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. మూడు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com