ఇజ్రాయెల్‌లో 'బ్రహ్మాస్త్ర' సినిమా

- January 03, 2018 , by Maagulf
ఇజ్రాయెల్‌లో 'బ్రహ్మాస్త్ర' సినిమా

రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కరణ్‌జోహార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్రలో అమితాబ్‌బచ్చన్‌ నటించనున్నారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానుంది. దీనికి సంబంధించిన సన్నాహాలు ఇజ్రాయెల్‌లో మొదలయ్యాయి. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా పంచుకొన్నారు కరణ్‌. ''బ్రహ్మాస్త్ర' ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త సంవత్సరంలో ఈ సినిమా ప్రారంభానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది''అని ట్వీటారు. ఇందులో రణ్‌బీర్‌ అతీంద్రియ శక్తులున్న పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా తొలి భాగం ఆగస్టు 2019కి ప్రేక్షకుల ముందుకురానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com