విజయ్‌తో మురుగదాస్‌ సినిమా

- January 03, 2018 , by Maagulf
విజయ్‌తో మురుగదాస్‌ సినిమా

చెన్నై: 'మెర్సల్‌' చిత్రం తర్వాత విజయ్‌ ఎవరి దర్శకత్వంలో నటిస్తారనే విషయంపై స్పష్టత వచ్చింది. మళ్లీ అట్లి దర్శకత్వంలో నటిస్తారని కొందరు.. మురుగదాస్‌ చిత్రంలో నటిస్తారని మరికొందరు అభిప్రాయపడ్డారు. కానీ మురుగదాస్‌ దర్శకత్వంలోనే విజయ్‌ నటించడం ఖరారైంది. ఇది విజయ్‌కి 62వ సినిమా. మురుగదాస్‌తో మూడో సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం సమకూర్చనున్నారు. గతంలో విజయ్‌ నటించిన 'ఉదయ', 'అళగియ తమిళ్‌ మగన్‌', 'మెర్సల్‌' చిత్రాలకు రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. ఆ తర్వాత మురుగదాస్‌ కాంబినేషన్‌లోని సినిమాకు సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రానికి క్రిష్‌ గంగాధర్‌ సినిమాటో గ్రాఫర్‌గా, శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. హాస్యనటుడిగా యోగిబాబును ఎంచుకున్నారు. గత ఏడాది మంచి గుర్తింపు తెచ్చుకున్న యోగిబాబు.. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలకు మంచి ఛాయిస్‌గా నిలుస్తున్నారు.

సాయిపల్లవి కథానాయికగా నటించే అవకాశముందని కోలీవుడ్‌ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com