ఔనా!! వాళ్లిద్దరూ లంకలో ఒక్కటవ్వనున్నారా?

- January 04, 2018 , by Maagulf
ఔనా!! వాళ్లిద్దరూ లంకలో ఒక్కటవ్వనున్నారా?

బాలీవుడ్‌లో మరో వివాహ వేడుక జరగనుందా? అవుననే అంటోంది జాతీయ మీడియా. ఇంతకీ వధూవరులు ఎవరోకాదు.. దీపికా పదుకుణె- రణవీర్ సింగ్‌లు. వీళ్లిద్దరు వివాహంతో ఒక్కటి కాబోతున్నారని టాక్. జనవరి ఐదున దీపిక బర్త్‌డే కావడం తో ఈ డేట్ కోసమే ఈ జంట వెయిట్ చేసిందని బీటౌన్ సమాచారం. శుక్రవారంతో దీపికా 32వ ఏట అడుగుపెడుతోంది.

నార్మల్‌గా దీపికా ఆస్ట్రియాలో వుండగా, రణవీర్ మాత్రం షూట్ కోసం శ్రీలంక వెళ్లాడు. ఈ నేపథ్యంలో దీపికా అక్కడకి వెళ్లేందుకు ఫ్లయిట్ టికెట్లు బుక్ చేసుకున్నట్టు ఆమె క్లోజ్‌ఫ్రెండ్స్ చెబుతున్నమాట. బర్త్ డే సెలబ్రేషన్స్‌లో ఈ జంట రింగ్స్ మార్చుకోవడం ఖాయమని జాతీయ మీడియాలో కథనాలు. ఇండియా నుంచి ఇరుకుటుంబాల సభ్యులు కలసి ఇప్పటికే శ్రీలంకకు చేరుకున్నట్లు టాక్. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం దీపిక- రణవీర్‌లు మాల్దీవులకు వెళ్లారు. ఈ జంట ఐదేళ్లుగా డేటింగ్‌లో నిమగ్నమైన సంగతి తెల్సిందే!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com