అమెరికా సెక్రటరీ-ఆఫ్-స్టేట్ ను కలిసిన బహ్రైన్ విదేశాంగ శాఖా మంత్రి

- November 20, 2015 , by Maagulf
అమెరికా సెక్రటరీ-ఆఫ్-స్టేట్ ను కలిసిన బహ్రైన్ విదేశాంగ శాఖా మంత్రి

బహ్రైన్ విదేశాంగ శాఖా మంత్రి షేక్ ఖాలిద్ బిన్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్-ఖలీఫా, అమెరికా సెక్రటరీ-ఆఫ్-స్టేట్ జాన్ కెర్రీ తో జరిగిన సమావేశంలో- స్థిరమైన బహ్రైన్, అమెరికా దేశాలమధ్య స్థిరంగా సహకారం   అభివృద్ధి చెందవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ సమావేశంలో ఇరుదేశాల  ద్వైపాక్షిక సంబంధాలు, ఉమ్మడి ప్రయోజనాలను సమకూర్చే అంశాలు, ఎదుర్కోవలసిన ఉమ్మడి లక్ష్యాలను గురించిన చర్చ జరిగింది. ఈ ప్రాంతంలో భద్రత మరియు స్థిరత్వాన్ని సాధించడంలో అమెరికా ముఖ్య పాత్ర  పోషిస్తోందని మంత్రి షేక్ ఖాలిద్ ప్రసంసించగా, ఈ రాజ్యం మున్ముందు అభివృద్ధి మరియు సౌభాగ్యాలతో విలసిల్లాలని, ఇరుదేశాల సత్సంబంధాలను పెంపొందించడానికి తము కట్టుబడి ఉంటాయని, జాన్ కెర్రీ అభిలషించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com