తాయిఫ్ లో నవజాత శిశువును నలిపి రాక్షసత్వం చాటుకున్న ముగ్గురు నర్సులు సస్పెండ్

- January 05, 2018 , by Maagulf
తాయిఫ్ లో నవజాత శిశువును నలిపి రాక్షసత్వం చాటుకున్న ముగ్గురు నర్సులు సస్పెండ్

జెడ్డా:' ఎవరికి పుట్టిన బిడ్డరా...వెక్కి వెక్కి ఏడుస్తుందని '  ఓ సామెత తనకు చెందని శిశువు పట్ల ఆ తరహా ఉత్తుత్తి మమకారం వెనుకటికి ఎవరో చూపించారట.. లక్షలాది రూపాయల ప్రభుత్వ వేతనం తీసుకొంటూ మానవసేవే చేయాల్సిన కొందరు నర్సమ్మలు తమ క్రూర నైజాన్ని సామాజిక మాధ్యమాల సాక్షిగా సభ్య సమాజానికి చూపించారు. అపుడే పుట్టిన నవజాత పసిగుడ్డులను తమ కరకు ఇనుప చేతులతో నలిపి నలిపి వికృతానందం పొందారు. తైఫ్ లో ఒక ప్రసూతి ఆసుపత్రిలో నర్సులు చేసిన ఈ దారుణమైన చేష్టలను  సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడిన ఒక వీడియో స్థానికంగా సంచలనం కల్గిస్తుంది. శిశువుల తలలపై బలంగా చేతులతో ఆదమడం...పసి పుర్రెలను కిందకు అదిమి అదిమి నొక్కడంతో  నవజాత శిశువు పుట్టిన వెంటనే నరకయాతనకు గురైనట్లుగా ఆ వీడియో లో  కనిపించింది, దీంతో ఆ ముగ్గురు సైకో నర్సులను ఉద్యోగాల నుండి తొలగించారు మరియు వారి వృత్తిపరమైన లైసెన్సులు రద్దు చేశారు. ఆ విధంగా పాల్పడిన ముగ్గురు నర్సులను సస్పెండ్ చేశారు. వారిపై  బుధవారం విచారణ జరిగింది. నిజ నిర్ధారణ తరువాత, నర్సులు తొలగించబడ్డారని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది మరియు వారి వైద్య లైసెన్సులు రద్దు చేయబడ్డాయి. అంతేకాక  వారు ఇతర ప్రాంతాలలోనూ ఆరోగ్య రంగాలలోనర్సింగ్ సాధన చేయకుండా కఠినంగా నిషేధించబడ్డారు.జెడ్డాలోని నేషనల్ గార్డ్ హాస్పిటల్లో మెడికల్ ఎథిక్స్ బోధిస్తున్న డాక్టర్ మొహమ్మద్ అల్-గంది ఈ సందర్భంగా మాట్లాడుతూ : " బాధితులుగా ఉన్న పిల్లల పరిస్థితి చూస్తే , ఎవరికైన సానుభూతి కలగకతప్పదని సోషల్ మీడియాలో వారి రాక్షసత్వం గమనిస్తే ఈ చర్యలు వారిపై తీసుకోవడం  చాలా సహజ ప్రతిస్పందన అని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com