రెండోసారి గల్ఫ్ కప్ సాధించిన ఒమన్
- January 06, 2018
మస్కట్: ఒమన్ గోల్ కీపర్ ఫయాజ్ అల్ రుషైది, యూఏఈ స్టార్ ప్లేయర్ ఒమర్ అబ్దుల్ రహ్మాన్ 'అమూరీ' ఐదో పెనాల్టీ కిక్‌ని సేవ్ చేయడం, మొహ్‌సిన్ జవార్ సత్తా చాటడంతో ఒమన్, రెండోసారి గల్ఫ్ కప్‌ని కైవసం చేసుకోగలిగింది. ఇరు జట్లూ 90 నిమిషాలపాటు అలాగే ఎక్స్‌ట్రా టైమ్‌లోనూ గోల్ చేయడంలో విఫలమయ్యాయి. అయితే యూఏఈ, గోల్డెన్ ఛాన్స్ దక్కించుకోగా, అమూరీ బ్రిలియంట్ కిక్‌ని రుషైదీ సేవ్ చేయడం ఈ మ్యాచ్‌కి హైలైట్ పాయింట్స్. ఎనిమిదేళ్ళ తర్వాత ఒమన్‌కి గల్ఫ్ కప్ దక్కింది. తొలిసారిగా 2009లో మస్కట్‌లో జరిగిన పోటీల్లో ఒమన్ ఈ కప్‌ని కైవసం చేసుకుంది. గతంలో ఫ్రెంచ్ మ్యాన్ క్లాడీ లె రాయ్ కోచ్‌గా వ్యవహరిస్తే, ఇప్పుడు నెదర్లాండ్స్‌కి చెందిన పిమ్ వెర్బీక్ కోచ్‌గా పనిచేశారు.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







