షాకింగ్: మళ్ళీ పెళ్లి చేసుకున్న కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి

- January 06, 2018 , by Maagulf
షాకింగ్: మళ్ళీ పెళ్లి చేసుకున్న కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన వెంకీ చిత్రంలో రవితేజ ఫ్రెండ్ గా నటించి కమెడియన్ గా తన స్థానాన్ని ఇండస్ట్రీ లో సుస్థిరం చేసుకున్నాడు శ్రీనివాస్ రెడ్డి.ఆ తరువాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ఒక ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.కేవలం కమెడియన్ పాత్రలకు మాత్రమే పరిమితం అవకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తనని తాను నిరూపించుకున్నాడు.

కేవలం కమెడియన్,క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు మాత్రమే పరిమితం అవకుండా హీరోగాను చేస్తున్నాడు.శివ రాజకుమారి దర్శకత్వంలో 2016 లో వచ్చిన జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో హీరోగా చేసిన సినిమాతో తన నటనతో ఆకట్టుకోవడమే కాకుండా సినిమా మంచి కంప్లీట్ కుటుంబ వినోదాత్మక చిత్రంగా నిలిచింది.ఇటీవల అతనికి రెండవ కూతురు కూడా పుట్టింది.ఇదేంటి రెండవ కూతురు పుట్టినా కూడా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అని అనుకుంటున్నారా?అవును అది నిజమే!

కానీ అది నిజమైన పెళ్లి కాదoడి బాబోయ్.గతంలో అద్భుత విజయం సాధించిన కామెడీ చిత్రం జంబలకడి పంబ టైటిల్ నే పెట్టి శ్రీనివాస్ రెడ్డి హీరోగా ఒక చిత్రం తీస్తున్నారు.ఈ చిత్రం ద్వారా సిద్ది ఇద్నాని అనే హీరోయిన్ తెలుగు ఇండస్టీ కి పరిచయం అవబోతుంది.కాగా షూటింగ్ లొకేషన్ లో పెళ్లి దుస్తుల మీద ఉన్న ఫోటోని ట్విట్టర్ లో మళ్ళీ పెళ్లి అని కాప్షన్ తో సరదాగా అప్ లోడ్ చేశాడు.కాగా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కూడా నటిస్తున్నాడు.ఇటీవలే షూటింగ్ ని ప్రారంభించిన చిత్ర బృందం ఈ వేసవికి ముందు చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకరావాలని ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com