గజల్ శ్రీనివాస్‌పై చంద్రబాబు సర్కారు వేటు

- January 06, 2018 , by Maagulf
గజల్ శ్రీనివాస్‌పై చంద్రబాబు సర్కారు వేటు

గజల్ శ్రీనివాస్ అంటే తెలియని వారంటూ వుండరు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన వ్యక్తిపై ప్రస్తుతం లైంగిక ఆరోపణలు వచ్చాయి. పోలీసులు పక్కా ఆధారాలు వుండటంతో జైలుకు పంపారు. ఇప్పటికే గజల్ శ్రీనివాస్ ప్రచారకర్తగా వ్యవహరించిన సంస్థలన్నీ ఆయన్ని తొలగించే పనిలో పడ్డాయి. తాజాగా తన వద్ద పనిచేస్తున్న యువతిని లొంగదీసుకోవాలని ప్రయత్నించిన శ్రీనివాస్‌కు మరో షాక్ తగిలింది.

శ్రీనివాస్ వీడియోలు లీక్ కావడంతో ప్రతి ఒక్కరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్ సర్కారు సైతం శ్రీనివాస్‌కు షాకిచ్చింది. గజల్ శ్రీనివాస్‌ను ఏపీ స్వచ్ఛాంధ్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్ హోదా నుంచి తొలగిస్తున్నట్టు చంద్రబాబు సర్కారు ప్రకటించింది. గజల్ శ్రీనివాస్ పై వచ్చిన ఆరోపణలు, కనిపిస్తున్న సాక్ష్యాల నేపథ్యంలో, ఈ పదవికి ఆయన అర్హుడు కాదన్న నిర్ణయం తీసుకుంది.

కాగా, ఓ కంప్యూటర్ ఆపరేటర్, రేడియో జాకీ, మూడు నెలల నుంచి పకడ్బందీ ఆపరేషన్ నిర్వహించి. అంత పక్కాకా సీసీ కెమెరాలను అమర్చి గజల్ శ్రీనివాస్ బండారాన్ని బయటపెట్టేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలు మీడియాకు చిక్కడంతో గజల్ శ్రీనివాస్ గలీజు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com