సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది బంగ్లాదేశ్ కార్మికులు మృతి
- January 07, 2018
సౌదీ అరేబియా : 23 మంది కార్మికులతో వెళ్తోన్న ఒక బస్సుని ను ఎదురుగా వస్తున్నా మరో భారీ వాహనం ఢీ కొట్టిన దుర్ఘటనలో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు పేర్కొన్నారు. .జిజాన్ నగర ప్రాంతంలోని అల్ హర్హ రోడ్డుపై శనివారం ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు వివరించారు. ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలపాలైన 15 మందిని ఆసుపత్రికి తరలించామని వారు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు ఒక ప్రయివేటు కంపెనీకి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. బస్సులో ప్రయాణికులందరూ అదే కంపెనీ కార్మికులని వారు చెబుతున్నారు. అందరూ బంగ్లాదేశ్‌కు చెందినవారని పోలీసులు చెప్పారు. బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంకు సైతం సమాచారం అందించామని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







