'అజ్ఞాతవాసి' గల్ఫ్ పోస్టర్ లాంచ్

- January 07, 2018 , by Maagulf

దుబాయ్:పవనిజం..ఒక ప్రభంజనం, ఒక బ్రాండ్...పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సంక్రాంతి పండుగ మరింత స్పెషల్ అనే చెప్పచ్చు, కారణం 'అజ్ఞాతవాసి' గా వస్తున్నాడు పవన్. పవన్ కళ్యాణ్ నడిచిన 25వ చిత్రం అవ్వటమే కాకుండా చిత్రం ట్రైలర్, పవన్ పాడిన పాట చిత్రం పై అంచనాలను పెంచేసాయి. 

'అజ్ఞాతవాసి' గల్ఫ్ పోస్టర్ ను నిన్న 'దుబాయ్ పవనిజం సేవా సమితి' ఆధ్వర్యంలో 'అల్ కూస్' లోని 'బాలీవుడ్ సినిమాస్' లో ఘనంగా లాంచ్ చేశారు. సమితి ప్రెసిడెంట్ ప్రసాద్ పెద్దిశెట్టి తోటి అభిమానులతో ఈ కార్య్రక్రమాన్ని ఎంతో వైభవంగా చేశారు. చిత్రం ఘన విజయం సాధించటం ఖాయం అని ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా 'అజ్ఞాతవాసి' సీడీలను రిలీజ్ చేసి మొదటి కాపీ ని  మాగల్ఫ్ అధినేత శ్రీకాంత్ చిత్తర్వు కి అందించారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, అప్పాజీ, రవి సింగరి, సాలెం బాబు, చల్లా రవి, సాయినాథ్ కొట్టే తదితరులు పాల్గొన్నారు. 'అజ్ఞాతవాసి' గల్ఫ్ డిస్ట్రిబ్యూటర్ మను మాట్లాడుతూ 'ఈ సినిమాను 9న  60 సెంటర్స్ లో రిలీజ్ చేస్తున్నామని, చిత్రం ఘన విజయం సాధిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com