అందరి మెప్పును పొందుతున్నమార్పు

- January 07, 2018 , by Maagulf
అందరి మెప్పును పొందుతున్నమార్పు

'ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది' అన్నట్టుగానే దుబాయ్ ని పరిపాలించే రాజు తన ఆలోచనతో సమాజంలో పెను మార్పుకు కారణమయ్యారు.

వికలాంగులు తమ మనోధైర్యంతో ఎంతో ప్రగతిని సాధిస్తున్నారు మరియు దేశ ప్రగతికి ఎంతో తోడ్పడుతున్నారు.. అంగవైకల్యం శరీరానికే గానీ మనసుకీ, మేధాశక్తికీ కాదని, వారికున్న మనోనిబ్బరం ఎంతో మెచ్చుకోతగ్గదని.. యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు దుబాయ్ ప్రధానమంత్రి అయినటువంటి దుబాయ్ రారాజు 'HH Sheikh Mohammed bin Rashid Al Maktoum' ఇకపై వికలాంగులను 'People of Determination' అని సంభోదించాలి అని నిర్దేశించారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం సదా ఆదర్శనీయమని, హర్షించదగ్గదని ప్రజలు వేయి నోళ్ళ కొనియాడుతున్నారు.

అన్ని బహిరంగ ప్రదేశాలలో, ఎయిర్పోర్ట్ లలో కూడా 'People of Determination' బోర్డులను చూసి రాజు తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.

కాగా వికలాంగులను 'దివ్యాంగులు' గా సంభోదించాలి అని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించడం గమనార్హం. ఇరు దేశాల ప్రధానమంత్రులు తీసుకున్న ఈ నిర్ణయాలు అభినందనీయలే..ఏమంటారు? 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com