మెక్సికోలో కాల్పుల కలకలం - 11 మంది మృతి
- January 08, 2018
వాషింగ్టన్: మెక్సికోలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఎకాపల్కో రిసార్ట్లైన్ వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో 11 మంది మృతిచెందారు. మృతుల్లో 8 మంది స్థానికులు, ముగ్గురు సీఆర్‌ఏసీ గ్రూప్ మిలిటెంట్లు ఉన్నారు. ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అటార్నీ జనరల్ జేవియర్ ఓలియా పేలెజ్ తెలిపిన వివరాల ప్రకారం...మెక్సికోలోని ఎకాపల్కో రిసార్ట్ టౌన్‌కు సమీపంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ రిసార్టులోకి కొంతమంది దుండగులు ప్రవేశించి బీభత్సం సృష్టించారు. స్థానికులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 8 మంది కాలనీవాసులు చనిపోయారు. సమాచారం అందుకున్న సీఆర్‌ఏసీ మిలిటెంట్లు ఘటనాస్థలికి చేరుకున్నారు. రిసార్ట్ టౌన్‌ను చుట్టుముట్టి దుండగులపై కాల్పులు జరిపారు. దుండగులు, మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మిలిటెంట్లు మృతి చెందారు. సామాజిక మాధ్యమాల కాల్పుల ఉదంతం సమాచారం తెలుసుకున్న మెక్సికో ఆర్మీ, ఫెడరల్, స్టేట్ బలగాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. రిసార్ట్‌లో తలదాచుకున్న దుండగులను, మిలిటెంట్లను అదుపులోకి తీసుకున్నాయి. ఘటనాస్థలంలో లభ్యమైన మారణాయుధాలు, తుపాకులు, బాంబులను స్వాధీనం చేసుకున్నాయి.
తాజా వార్తలు
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్‌లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు







