పోలవరం-పట్టిసీమ ప్రాజెక్టులు సందర్శించిన ప్రవాసులు
- January 08, 2018




ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో 12దేశాల నుండి వచ్చిన ప్రవాసాంధ్ర బృందం సోమవారం నాడు పోలవరం-పట్టిసీమ ప్రాజెక్టులను సందర్శించింది. ఈ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీరు రమేష్‌బాబు, ప్రాజెక్టుల్లో జరుగుతున్న పనులను గురించి ఎన్నారై బృందానికి వివరించారు. అంతకుముందు తాటిపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ బృందంతో భేటీ అయ్యారు. ఏపీ ఎన్ఆర్టీ బృందం చేపట్టిన స్మాష్ & ట్రాష్ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నామని, గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రుల కోసం ప్రత్యేక పథకాన్ని చేపడుతున్నామని ఆయన తెలిపారు. ప్రవాసాంధ్రులకు అవసరమైన అన్ని రకాల సేవలను ఏపీ ఎన్ఆర్టీ ద్వారా అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. జన్మభూమి పథకంలో ప్రవాసాంధ్రులు విరివిగా పాల్గొని తమ గ్రామాల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని బాబు విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం దేవరపల్లి గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముళ్లపూడి వెంకటరావు మంచి విందును ఏర్పాటును చేసి ప్రవాసులకు గోదావరి రుచులను చవిచూపించారు. కార్యక్రమంలో ఏపీ ఎన్ఆర్టీ సీఈఓ డా.వేమూరు రవికుమార్, కలపటు బుచ్చిరాంప్రసాద్, మేడి మాధవి, డీవీ రావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..







