టూ స్టేట్స్‌ లో 'శివానీ' సందడి చేయబోతోందా..!!

- January 09, 2018 , by Maagulf
టూ స్టేట్స్‌ లో 'శివానీ' సందడి చేయబోతోందా..!!

ఈ మధ్య నటుల కుమార్తెలు కూడా తెరంగేట్రం చేస్తున్నారు. ఇది కాస్త బాలీవుడ్‌లో ఎక్కువే అయినా ఇప్పడు టాలీవుడ్‌లో కూడా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఇప్పటికే మెగా ప్యామిలీ నుంచి వచ్చిన నాగబాబు కుమార్తె నీహారిక అటు బుల్లి తెర, ఇటు వెండి తెరపై సందడి చేస్తూ అభిమానుల్ని సంపాదించుకుంటోంది. అదే బాటలో రాజశేఖర్ తనయ కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఎప్పట్నించో వార్తల్లో నానుతున్నా మంచి పాత్ర కోసం వేచి చూస్తున్నట్టుంది. ఇప్పుడు ముహూర్తం ఖరారైంది. బాలీవుడ్‌లో విజయవంతమైన 'టు స్టేట్స్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అడవి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తోంది. వెంకట్ కుంచె దర్శకత్వం వహిస్తున్నారు. హిందీలో అలియాభట్ కథానాయికగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. మరి తెలుగులో నటిస్తున్న శివానీకి ఎన్ని మార్కులు వస్తాయో చూడాలి. రాజశేఖర్ దంపతులు కూడా బాగా చదివేస్తున్నారు స్క్రిప్ట్‌ని. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేయాలంటే ఆ మాత్రం కసరత్తు చేయక తప్పదు మరి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com