12న భారత రిపబ్లిక్ డే - హాకీ ఫెస్టివల్ సెలబ్రేషన్
- January 09, 2018
మస్కట్: 69వ భారత రిపబ్లిక్ దినోత్సవం, హాకీ ఫెస్టివల్ జనవరి 12న సుల్తాన్ కబూస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, బషెర్లో ఎంబసీ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో జరగనుంది. ఒమన్‌లో బారత రాయబారి ఇంద్రా మణి పాండే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఒమన్ హాకీ అసోసియేషన్ ఛైర్మన్ కెప్టెన్ తాలిబ్ ఖామ్సి అల్ వాహిబి, ఒమన్ ఫుట్‌బాల్ మాజీ ప్రెసిడెంట్ షేక్ సౌద్ రావాహి, రహా పోలీ ప్రోడక్ట్స్ జిఎం సయ్యద్ అన్వర్ అహ్సాన్ తదితరులు గౌరవ అతిథులుగా హాజరవుతారు. ప్రత్యేక అతిథిగా రాయబారి సతీమణి సుష్మాపాండేని ఆహ్వానించారు. టీమ్ కూర్గ్ మస్కట్, ఫ్రెండ్స్ ఆఫ్ నక్వి గ్రూప్ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. గత 12 ఏళ్ళుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. రిపబ్లిక్ డే ట్రోఫీలో టీమ్ కూర్గ్ మస్కట్, యుటిఎస్సి మరియు ఒమన్ వెటరన్ ఎలెవన్, అంబాసిడర్ ప్రధాన జట్లు. అంబాసిడర్ కప్ (మెన్స్ కప్)లో మూడు టీమ్‌లు అంబాసిడర్ ఎలెవన్, ఇండియన్ స్కూల్ సీబ్, ఇండియన్ స్కూల్ మాబెలా పాల్గొంటాయి. అంబాసిడర్ కప్ (విమెన్) ఎగ్జిబిషన్ హాకీ మ్యాచ్ ఇండియన్ స్కూల్ సీబ్ విమెన్స్ టీమ్ మరియు ఇండియన్ స్కూల్ మాబెలా మధ్య జరగనుంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







