జూన్ 28 నుంచి అమర్నాథ్ యాత్ర
- January 09, 2018
జమ్ము: ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది 60 రోజులపాటు కొనసాగనుంది. జ్యేష్ఠపూర్ణిమనాడు (జూన్ 28న) దీన్ని ప్రారంభించనున్నట్లు దేవస్థాన బోర్డు అధికార ప్రతినిధి మంగళవారం తెలిపారు. బోర్డు సభ్యులతో సమావేశమైన అనంతరం బోర్డు ఛైర్మన్, రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోరా తేదీలను ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని ఈ దేవాలయ పరిసరాల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలపైనా చర్చించామని, వీటిపై సమీక్షా పిటిషన్ దాఖలు చేస్తామని వివరించారు. దేవాలయ పరిసరాల్లో అందరూ నిశ్శబ్దం పాటించాలని ట్రైబ్యునల్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై నిరసనలు వ్యక్తంకావడంతో.. గుహలో మంత్ర ఉచ్చారణలు, భజనలపై తాము ఎలాంటి నిబంధనలూ విధించడంలేదని ఎన్జీటీ స్పష్టతనిచ్చింది.మంచు లింగం ముందుకు వెళ్లినప్పుడు మాత్రం అందరూ నిశ్శబ్దంగానే ఉండాలని స్పష్టీకరించింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







