షార్జా వేర్‌హౌస్‌ దగ్ధం: భారీగా ఆస్తి నష్టం

- January 10, 2018 , by Maagulf
షార్జా వేర్‌హౌస్‌ దగ్ధం: భారీగా ఆస్తి నష్టం

షార్జా:ఓ వేర్‌హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించింది. న్యూ ఇండస్ట్రియల్‌ ఏరియాలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. షార్జా సివిల్‌ డిఫెన్స్‌ ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకోగానే, సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని ఆర్పివేసేందుకు ప్రయత్నించింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. షార్జా సివిల్‌ డిఫెన్స్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ షమ్షి మాట్లాడుతూ, తెల్లవారుఝామున 1.50 నిమిషాల సమయంలో ఈ ఘటనపై తమకు సమాచారం అందిందనీ, సంఘటనా స్థలానికి కేవలం 4 నిమిషాల్లోపే చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేశామని అన్నారు. 30 నిమిషాల్లో మంటల్ని ఆర్పివేయడం జరిగిందని చెప్పారాయన. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌తో కలిసి సివిల్‌ డిఫెన్స్‌, ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. వేర్‌హౌస్‌లు మరియు ఇండస్ట్రియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ నిర్వాహకులు భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అల్‌ షమ్షి విజ్ఞప్తి చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com