దుబాయ్:యోగా పేరుతో బాలికపై లైంగిక వేధింపులు

- January 10, 2018 , by Maagulf
దుబాయ్:యోగా పేరుతో బాలికపై లైంగిక వేధింపులు

దుబాయ్:24 ఏళ్ళ వ్యక్తి, 9 ఏళ్ళ బాలికను యోగా పేరుతో వేధింపులకు గురిచేసిన ఘటనలో నిందితుడు న్యాయస్థానంలో విచారణ ఎదుర్కొంటున్నాడు. టాయ్‌ షాప్‌లో ఉండగా, బాధితురాలి పట్ల నిందితుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే నిందితుడు ఈ ఆరోపణల్ని ఖండిస్తున్నాడు. 2017 అక్టోబర్‌ 20న ఈ సంఘటన చోటుచేసుకుంది. నిందితుడు ఇండియన్‌ రెసిడెంట్‌ కాగా, బాధితురాలు జోర్డానియన్‌. యోగా నేర్పుతానంటూ బాలికను నిల్చోమని, ఆ తర్వాత ఆమె చేతుల్ని పైకెత్తమని నిందితుడు కోరాడనీ, ఆమెను తాకేందుకు ప్రయత్నించగా ఆ చిన్నారి అక్కడినుంచి తప్పించుకుందని బాధితురాలి తల్లిదండ్రులు పేర్కొన్నారు.ఛాతి  ప్రాంతంలో తమ చిన్నారిని నిందితుడు తాకేందుకు ప్రయత్నించాడని వారు చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా, నాలుగుసార్లు ఆ బాలికను నిందితుడు తాకినట్లు స్పష్టమయ్యింది. జనవరి 21న తదుపరి విచారణ కొనసాగుతుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com