3లక్షల 50 ఏళ్ల నాటి ఏనుగు దంతం ఎడారిలో లభ్యం
- January 12, 2018
రియాద్: ' ఏనుగమ్మ ..ఏనుగు.. మా వూరు వచ్చిందమ్మా ఏనుగుని పిల్లలు సంబరపడినమాదిరిగా సౌదీ వాసులు ఆనందపడుతున్నారు. కారణమేమిటంటే 3 లక్షల 50ఏళ్ల నాటి ఏనుగు దంతాలు ఎడారిలో కనుగొన్నారు. తైమా ప్రాంతంలోని ఒక ఎండిపోయిన ఒక ఒయాసిస్సులో పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఈ అరుదైన అవశేషాలు లభ్యమయ్యాయి. ఏనుగు దంతాలతోపాటు మొసళ్లు ఇతర జంతువులకు సంబంధించిన అవశేషాలు సైతం ఇక్కడ కనిపించాయని సౌదీ అర్కియాలజిస్టు డాక్టర్. అలీ అల్ గాబ్బన్ చెప్పారు. ప్రస్తుతం ఎడారిలా కనిపిస్తున్న ప్రాంతం ఒకప్పుడు జంతువులు జీవించడానికి అనువైన ప్రాంతామని ఆయన తెలిపారు. తైమాలో దొరికిన అవశేషాలను పరిశీలిస్తే సౌదీ చరిత్ర ఈనాటిది కాదని తెలుస్తోందని అలీ చెప్పారు. పలు చోట్ల తవ్వకాలు జరిపితే మరింత స్పష్టత వస్తుందని పురాతత్వ శాస్త్రవేత్త అలీ వ్యాఖ్యానిస్తున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







