లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడు అరెస్టు
- January 12, 2018
కువైట్ : ఒక ఈజిప్టు ప్రైవేట్ పాఠశాలకు చెందిన వ్యాయమ ఉపాధ్యాయుడు12 ఏళ్ల విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడానే ఆరోపణలపై ఆ నింధితుడిని అరెస్టు చేశారు, తరగతి గదిలోని విద్యార్థులఅందరిని వెలుపలకు పంపించి బాధిత బాలికను మాత్రమే క్లాస్ రూమ్ లో ఉండేవిధంగా చేసి బలవంతాన ముద్దాడటం...ఆమెని బలంగా నొక్కడం వంటి వెకిలిచేష్టలకు పాల్పడినట్లు ఆ బాలిక ఆరోపించింది. అంతేకాక తానింకా పెద్దయ్యిన తర్వాత పెళ్లి చేసుకొంటానని తనతో చెబుతున్నట్లు పిర్యాదు చేసింది. కీచక గురువు లైంగిక వేధింపులు తీవ్రమవడంతో ఆ బాలిక తన తల్లికి చెబుతానని పేర్కోవడంతో ఆ విధంగా నివేదించవద్దని ఉపాధ్యాయుడు బెదిరించాడు. కానీ ఆ బాలిక దైర్యం చేసి పాఠశాల ప్రిన్సిపాల్ కు నివేదించింది. ఆ తర్వాత తన తల్లితో కల్సి నిందితుడిపై కేసు నమోదు చేశారు.నిందితుడిని దేశ బహిష్కరణ ముందు కేసు విచారణ నిమిత్తం ఖైదు చేశారు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
- ఓటమి పై యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం ఏమన్నారంటే?
- హైదరాబాద్ లో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే రూట్ ఖరారు
- షేక్ జాయెద్ రోడ్డులో మోటార్ సైక్లిస్ట్ మృతి..!!
- ముబారకియా మార్కెట్ కోసం ఏసీ వాక్వేలు..!!
- అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..!!
- ఇరాన్-IAEA ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఉద్యోగిని కొట్టిచంపిన వ్యక్తికి జీవితఖైదు..!!
- పిల్లలు, యువతపై వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం..!!
- యూఏఈ పై భారత్ ఘన విజయం