కన్నకూతుళ్లతో వ్యభిచారం చేయించిన దుర్మార్గపు తండ్రి
- January 17, 2018
దుబాయ్: కంటికి రెప్పలా కన్నకూతుళ్లను కాపాడాల్సిన ఓ దుర్మార్గుడైన ఓ తండ్రి దుబాయ్ లో కన్నకూతుళ్లతోనే వ్యభిచారం చేయిస్తున్నాడు. వలసదారుడిగా ఏదో పని నిమిత్తం దుబాయ్ వచ్చి పార్ట్ టైం పాపపు సొమ్ముతో తన దేశానికి వెళ్లి ధనవంతుడిగా స్థిరపడాలని యోచించాడు. కానీ, తమ తండ్రి తమను ఏ విధంగా డబ్బు సంపాదించే యంత్రాలుగా మార్చి దనం ఆర్జిస్తున్నాడో నిందితుని కుమార్తెలు పోలీసుల ఎదుట కన్నీళ్ల పర్యంతరమైపోయారు. వివరాలలోనికెళితే, కన్నకూతుళ్లతోనే వ్యభిచారం చేయించే నిందితునికి 10 మంది కుమార్తెలు , ఇద్దరు అబ్బాయిలు సంతానం కాగా, ఆ దుర్మార్గుడు దుబాయ్ వచ్చిన కొంతకాలానికి 18 ఏళ్లు నిండిన ఇద్దరు పెద్ద కూతుళ్లను దుబాయ్ రప్పించి వారితో వ్యభిచారం చేయిస్తున్నాడు. కొద్ది రోజుల గడిచిన తర్వాత మిగిలిన అమ్మాయిలందరినీ దుబాయ్ రప్పించాడు. వారిని స్థానిక నైట్ క్లబ్‌లలో డ్యాన్స్ చేయడానికి తీసుకెళ్లేవాడు. క్రమంగా వారితో వ్యభిచారం చేయించడం మొదలుపెట్టాడు. చెప్పినట్లు వినకపోతే భోజనం పెట్టకుండా చిత్ర హింసలు పెట్టేవాడు. దాంతో కూతుళ్లందరూ తండ్రి చెప్పినట్లే వినేవారు . అయితే ఓ రోజు తమ దేశానికి చెందిన వ్యక్తి వారి ఇంటికి వచ్చాడు. అతడికి కూతుళ్లు అన్ని విషయాలు చెప్పారు. వెంటనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. తమ తండ్రి తమతో వ్యభిచారం చేయిస్తున్నాడని ఒక్క రాత్రికి 200 దిర్హమ్స్ 300 దిర్హమ్స్ వసూలు చేస్తుంటాడని ఆ యువతులు పోలీసులకు చెప్పారు. పోలీసులు తండ్రిని కోర్టులో హజరుపరిచారు. కోర్టు ఈ కేసును జనవరి 24 వ తేదికి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







