బర్వాన్‌ తంగ్డీ

బర్వాన్‌ తంగ్డీ

కావలసినవి: చికెన్‌ లెగ్స్‌ - మూడు పీస్‌లు, ఉప్పు - రుచికి సరిపడా, నిమ్మకాయ - ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ - ఐదు గ్రాములు, మటన్‌ ఖీమా(ఉడికించి), బ్రెడ్‌ ముక్కలు - ఒక్కోటి వందగ్రాముల చొప్పున, గుడ్డు - ఒకటి, నల్లమిరియాలు - 05 గ్రాములు, ఎండుమిర్చి గుజ్జు - పది గ్రాములు, నూనె - వేగించడానికి సరిపడా.
 
తయారీ: చికెన్‌ లెగ్స్‌ను శుభ్రంగా కడిగి అల్లంవెల్లుల్లి పేస్ట్‌, నిమ్మరసం, ఉప్పు వేసి నానబెట్టాలి.గుడ్డుసొనలో నల్లమిరియాలు, కారం కలపాలి.నానబెట్టిన చికెన్‌ లెగ్స్‌ తీసుకుని మటన్‌ ఖీమా స్టఫ్‌ చేయాలి.గుడ్డుసొనలో లెగ్స్‌ను ముంచి బ్రెడ్‌ ముక్కల్లో దొర్లించాలి. నూనె వేడిచేసి లెగ్స్‌ను బాగా వేగించాలి.

Back to Top