'ఛలో' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా చిరంజీవి
- January 19, 2018
ఛలో.. హిట్ కొట్టడానికి ఛల్ ఛలో.. ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ అనిపించిన భావన ఇదే. ఇప్పటికే రిలీజ్ చేసిన ఛలో టీజర్, మెలొడీ సాంగ్, టీజింగ్ సాంగ్ తో హల్ చల్ చేసి సూపర్ హిట్ సినిమా వైబ్రేషన్స్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన ఛలో ట్రైలర్ కు కూడా సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. దర్శకుడు వెంకీ కుడుములకు తొలి సినిమానే అయినా కూడా గురువు త్రివిక్రమ్ తరహాలోనే పంచ్ డైలాగులను బాగా పేల్చాడు. బాషా.. బాహుబలి.. తని ఒరువన్.. ఇలా వరసగా అన్ని సినిమాలపై పంచ్ లేసి క్యూరియాసిటీ పెంచారు. ట్రైలర్ కు ఇవన్నీ అదనపు ఆకర్షణగా నిలిచి ఛలో ను ట్రెండింగ్ లో ఉంచేలా చేశాయి. ఈ నెల 25న మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో ఛలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా ఛలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఛలో ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ ను ఇంతగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అలాగే ట్రైలర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ తర్వాత సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈనెల 25న ఛలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఇప్పటివరకు ఎవ్వరూ చేయని విధంగా వినూత్నంగా ప్లాన్ చేశాం. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా రానున్నారు. ఎంతో బిజీగా ఉండి కూడా ఛోలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా ఫిబ్రవరి 2న మీ ముందుకు రాబోతున్నాం. మహతి స్వర సాగర్ అందించిన పాటలు అద్భుతంగా వచ్చాయి. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం అని అన్నారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









