రైలు ప్రమాదంలో మరాఠి నటుడు దుర్మరణం.
- January 23, 2018
ముంబైలోని మలాద్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కబోతూ ప్రమాద వశాత్తు అదే రైలు కిందపడి మరాఠి యువ నటుడు ప్రపుల్లా భలేరావు దుర్మరణంపాలయ్యాడు.. అతడి వయసు 22 సంవత్సరాలు. తన స్వగ్రామమైన గిర్ గాంకు వెళ్లాలన్న ప్రయత్నంలో మలాద్ స్టేషన్ కు వచ్చిన ప్రపుల్లా, నడుస్తున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలైన అతనిని దగ్గరలోనే ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించాడని వైద్యులు వెల్లడించారు. కాగా, ప్రఫుల్లా భలేరావు బాల నటుడిగా పరిచయమై గుర్తింపు పొందాడు. మరాఠీ టీవీల్లో ప్రసారమైన 'కుంకు', 'తు మాజా సంగతి', 'నకౌషి', 'జ్యోతిబా పూలే' తదితర సీరియల్స్ లలో నటించాడు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







