కెనడా మహిళకు లాటరీలో 6.20 కోట్లు ...ఇద్దరు ప్రవాసియ భారతీయులకు బీఎండబ్ల్యూ కార్లు
- January 23, 2018
దుబాయ్: ' ఎవరో వస్తారని...ఏదో చేస్తారని.. ఎదురు చూసి మోసపోకుమా అంటూ హెచ్చరిస్తూ ' కూలి డబ్బుతో లాటరీ టికెట్ ' అని పాత తెలుగు సినిమాలో సినీ గేయ రచయత లాటరీలను ఒక రకంగా గేలి చేశారు..అయితే గల్ఫ్ లో మాత్రం నిర్బయంగా లాటరీ టికెట్ కొనుక్కోవచ్చు. కెనడా మహిళకు ఆరు కోట్ల 20 లక్షలు .. కాయకష్టం నమ్ముకొని ఎడారి దేశాలకు వెళ్ళిన ఇద్దరు ప్రవాసియ భారతీయ కార్మికులకు ద్వితియ, తృతియ విజేతలుగా నిలవడంతో బీఎండబ్ల్యూ కార్లు బహుమతులుగా లభించాయి. దుబాయ్ లో నిర్వహించిన బంపర్ డ్రా పుణ్యమాని పలువురు కోటీశ్వరులుగా మారిపోతున్నారు..దుబాయ్ నగరంలో నివాసముంటున్న నిక్ పసిక్కో అనే కెనడా మహిళను భారీ లాటరీ లో ప్రధమ బహుమతి లభించింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలీనియర్ డ్రాలో లక్కీ విజేతగా ఆమె నిలిచింది. దీంతో ఆమెకు 3.6 మిలియన్(1 మిలియన్ డాలర్లు) దిర్హమ్‌లపైగా భారీ డబ్బు దక్కనుంది. భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ.6.30 కోట్లపైగా ఆమెకు లభించనున్నాయి. టికెట్ కొనుగోలు చేసిన సమయంలో విజేతను అవుతానని ఏమాత్రం భావించలేదని విజేత తెలిపింది. ఆ మొత్తానికి చెక్ అందుకోవడంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇదే లక్కీడ్రాలో భారత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ద్వితియ, తృతియ విజేతలుగా నిలిచి బీఎండబ్ల్యూ కార్లను బహుమతులుగా సొంతం చేసుకున్నారని నిర్వహకులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







