అలాస్కాలో సునామి హెచ్చరికలు జారీ
- January 23, 2018జునెయు : మంగళవారం తెల్లవారు జామున అలాస్కాలో తీవ్ర భూకంపం సంభవించింది. రిచ్‌టర్ స్కేలుపై దీని తీవ్రత 8.2గా నమోదైంది. సునామీ వచ్చే అవకాశాలున్నాయని అప్రమత్తంగా వుండాల్సిందిగా ప్రజల్ని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంతం నుండి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాల్సిందిగా కోరారు. అలాస్కాలోని చినియాక్‌కు ఆగేయంగా 256 కిలోమీటర్ల దూరంలో భూమిలో 10కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని అమెరికా భూగర్భ సర్వే తెలిపింది. అలాస్కాలోని పలు ప్రాంతాలు, కెనడా, అమెరికా పశ్చిమ తీర ప్రాంతం, హవాయి ద్వీపంలో సునామి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు వున్న సమాచారాన్ని బట్టి ఈ భూకంపం ధాటికి సునామీ వచ్చే అవకాశాలు వున్నాయని, అదే గనుక జరిగితే తీరప్రాంతాల్లో భీకర నష్టం జరుగుతుందని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం