కత్తి పోట్లు: మస్కట్‌లో ఒకరి పరిస్థితి విషమం

- January 24, 2018 , by Maagulf
కత్తి పోట్లు: మస్కట్‌లో ఒకరి పరిస్థితి విషమం

మస్కట్‌: ఒమన్‌ పౌరుడొకరు కత్తి పోట్లకు గురయ్యారు. ఇద్దరు వ్యక్తులు అతన్ని కత్తితో పొడిచినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ ఈ కత్తి పోట్లకు దారి తీసినట్లు తెలియవస్తోంది. ఇద్దరు వ్యక్తులు కలిసి మూడో వ్యక్తిని కత్తితో పొడిచారు. సీబ్‌లోని అల్‌ యుసుఫ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషమంగా మారడంతో, అతన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితుల్ని జ్యుడీషియల్‌ అథారిటీస్‌కి అప్పగించారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com