రెస్టారెంట్‌, బార్బర్‌ షాప్‌ మూసివేత

- January 24, 2018 , by Maagulf
రెస్టారెంట్‌, బార్బర్‌ షాప్‌ మూసివేత

మస్కట్‌: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఓ రెస్టారెంట్‌, అలాగే బార్‌ షాప్‌ని అధికారులు మూసివేశారు. కమర్షియల్‌ లైసెన్సుల్ని రెన్యువల్‌ చేయని కారణంగా వీటిని మూసివేసినట్లు అధికారులు వివరించారు. మస్కట్‌ మునిసిపాలిటీ సీబ్‌ - పీల్డ్‌ ఫాలో అప్‌ డిపార్ట్‌మెంట్‌ అల్‌ ఖౌద్‌ మరియు అల్‌ జాఫ్నిన్‌లో పలు దుకాణాల్ని మూసివేసింది. మునిసిపల్‌ చట్టాల్ని, నిబంధనల్ని ఉల్లంఘించడంతో ఈ మూసివేత చర్యలు తీసుకున్నామని మస్కట్‌ మునిసిపాలిటీకి చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. తాత్కాలికంగా వాటిని మూసివేయడంతోపాటుగా, 200 ఒమన్‌ రియాల్స్‌ జరీమానాని విధించారు. లైసెన్సుల్ని రెన్యువల్‌ చేసుకున్న తర్వాతే ఆ షాపుల్ని తిరిగి తెరచుకోవచ్చని అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com