రెస్టారెంట్, బార్బర్ షాప్ మూసివేత
- January 24, 2018
మస్కట్: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఓ రెస్టారెంట్, అలాగే బార్ షాప్‌ని అధికారులు మూసివేశారు. కమర్షియల్ లైసెన్సుల్ని రెన్యువల్ చేయని కారణంగా వీటిని మూసివేసినట్లు అధికారులు వివరించారు. మస్కట్ మునిసిపాలిటీ సీబ్ - పీల్డ్ ఫాలో అప్ డిపార్ట్మెంట్ అల్ ఖౌద్ మరియు అల్ జాఫ్నిన్లో పలు దుకాణాల్ని మూసివేసింది. మునిసిపల్ చట్టాల్ని, నిబంధనల్ని ఉల్లంఘించడంతో ఈ మూసివేత చర్యలు తీసుకున్నామని మస్కట్ మునిసిపాలిటీకి చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. తాత్కాలికంగా వాటిని మూసివేయడంతోపాటుగా, 200 ఒమన్ రియాల్స్ జరీమానాని విధించారు. లైసెన్సుల్ని రెన్యువల్ చేసుకున్న తర్వాతే ఆ షాపుల్ని తిరిగి తెరచుకోవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







