ఎయిర్‌పోర్ట్‌లో మిస్ అయిన చిన్నారి తల్లిదండ్రులకు అప్పగింత
- January 24, 2018
ఆసియా జంట, తమ చిన్నారిని ఎయిర్‌పోర్ట్‌లో మర్చిపోయి, ఇంటికి వెళ్ళిపోగా ఎయిర్‌పోర్ట్ అధికారులు, తప్పిపోయిన చిన్నారికి సంబంధించిన సమాచారాన్ని ఆ తల్లిదండ్రులకు తెలియజేసి చిన్నారిని వారికి అప్పగించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారితోపాటు, పలువురు కుటుంబ సభ్యులతో ఓ కుటుంబం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. చిన్నపాటి గందరగోళంతో చిన్నారిని మర్చిపోయి ల్ అయిన్‌లో తమ ఇంటికి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు. చిన్నారిని గుర్తించిన ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ - దుబాయ్ పోలీస్, సీసీటీవీ కెమెరాలను పరిశీలించి, చిన్నారి తల్లిదండ్రుల్ని కనుగొన్నారు. అనంతరం చిన్నారి తండ్రి ఫోన్ నెంబర్‌ని తెలుసుకుని, చిన్నారి సమాచారాన్ని ఆయనకి తెలియజేశారు. పోలీసుల నుంచి ఫోన్ రావడంతో షాక్ గురైన తల్లిదండ్రులు, వెంటనే తేరుకుని ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. అక్కడ తమ చిన్నారిని కలుసుకున్న తర్వాత, ఆ చిన్నారిని క్షేమంగా తమకు అప్పగించిన అధికారులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







