మరింతగా తగ్గనున్న అబుధాబిలో ఇంటి అద్దెలు
- January 24, 2018
అబుధాబి:రెసిడెన్షియల్ అద్దెలు, అలాగే అమ్మకం ధరలు అబుధాబిలో ఈ ఏడాది మరింత తగ్గనున్నాయని అంచనా వేస్తున్నారు. 2016తో పోల్చితే అపార్ట్మెంట్, విల్లా అద్దెలు 10 శాతం నుంచి 7 శాతం వరకు తగ్గగా, అమ్మకం ధరలు 10 శాతం నుంచి 4 శాతం వరకు తగ్గాయి 2017లో. ఈ ధరలు ఈ ఏడాదిలో ఇంకా తగ్గనున్నాయి. 2017 వివరాల్లోకి వెళితే సగటున ఏడాదికి 10000 దిర్హామ్ల వరకు వన్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ల ధరలు తగ్గాయి. డబుల్, త్రిబుల్ బెడ్రూమ్ యూనిట్స్ సగటున ఏడాదికి 16,500 దిర్హామ్ల వరకు తగ్గినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. లిమిటెడ్ ఎకనమిక గ్రోత్ కారణంగా జాబ్ కట్స్, రిడక్షన్ ఆఫ్ స్టాఫ్ అలవెన్సెస్, లిమిటెడ్ న్యూ ఎంప్లాయిమెంట్ ఆపర్చ్యూనిటీస్ ఇవన్నీ అద్దెలు తగ్గడానికి కారణాలుగా మార్కెట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది 9000 రెసిడెన్షియల్ యూనిట్స్ ఈ ఏడాది పూర్తి కానున్నాయి. వీటిలో 6,200 అపార్ట్మెంట్లు, 2,800 విల్లాస్ మరియు టౌన్ హౌస్లు ఉన్నాయి. రీమ్ ఐలాండ్, అల్ బహా బీచ్, యాస్ ఐలాండ్లలో వీటిని నిర్మిస్తున్నారు. అయితే కొన్ని ప్రాజెక్టులు వివిధ కారణాలతో 2019 నాటికి పోస్ట్ పోన్ అయినట్లు కూడా పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







